Telangana: అందుకే తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది: ఎమ్మెల్సీ కవిత

  • దేశంలో 40 శాతం ధాన్యం తెలంగాణలోనే పండుతోందన్న కవిత 
  • 61 లక్షల మంది రైతులు ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడి 
  • కేంద్రం కొనననడంతో కేసీఆరే కొంటున్నారని కామెంట్
Telangana Produces 40 Percent Of Paddy In India Says Kavitha

దేశంలో పండుతున్న ధాన్యంలో 40 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతోందని, అందుకే తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఊహించనంత వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, వారికి కనీస మద్దతునివ్వడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని, ఆ మద్దతును తీసుకోవడం దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల హక్కు అని అన్నారు. 

రాష్ట్రంలో వరి ఎక్కువగా పండడం వల్లే కేంద్ర ప్రభుత్వ సాయం కోరామని, ఢిల్లీలో ధర్నా చేశామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. వరి రైతులను కేంద్ర ప్రభుత్వం నిండా ముంచిందని అన్నారు. కేవలం మాటల్లోనే రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆరే వరి ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారని అన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మధ్య పోలికలు పెట్టాయని, కానీ, ఛత్తీస్ గఢ్ కేవలం 3.5 లక్షల టన్నుల వరి ధాన్యాన్నే పండిస్తోందని, అదే తెలంగాణలో 80 లక్షల టన్నుల ధాన్యం పండుతోందని అన్నారు. వాళ్ల తీరు యాపిల్స్ తో సంత్రలను పోల్చినట్టుందని మండిపడ్డారు.

More Telugu News