Vijayasai Reddy: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే నిలిపేయాలి.. విజయసాయిరెడ్డి డిమాండ్

Vijaya Sai Reddy Asks Center To Stop Privatization Of Vishakha Steel Plant
  • కేంద్రం పేరును ప్రస్తావించకుండానే విమర్శలు
  • ఫ్యాక్టరీలో వాటాను ఉపసంహరించుకోవడం ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించడమేనని వ్యాఖ్య
  • సంస్థకు అప్పులు తీర్చే శక్తి ఉందని వెల్లడి

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో కేంద్రం తన వాటాను ఉపసంహరించుకోవడమంటే ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించడమేనని అసహనం వ్యక్తం చేశారు. 

ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్) అమ్మకానికి బిడ్లు స్వీకరించడం కార్మికులను అవమానించడమేనని అన్నారు. ఈ ఏడాది సంస్థకు రూ.835 కోట్ల ఆదాయం సమకూరిందని, అప్పులు తీర్చగలిగే సత్తా సంస్థకు ఉందని చెప్పారు. మొండి వైఖరి మార్చుకోవాలంటూ కేంద్రం పేరును ప్రస్తావించకుండా ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News