Dhulipala Narendra Kumar: పెద‌కాకాని పోలీస్ స్టేష‌న్‌లో ధూళిపాళ్ల‌తో పాటు 93 మందిపై కేసుల న‌మోదు

police complaint against dhulipalla
  • మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్ వ‌ద్ద ఇటీవ‌ల‌ మాంసం కూర 
  • ఆ ఘ‌ట‌న‌పై ఈవో కార్యాల‌యం వ‌ద్ద బైఠాయించి ధూళిపాళ్ల నిర‌స‌న‌
  • ఉద్యోగుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని కేసు
గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్ వ‌ద్ద మాంసం కూర కన‌ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన‌ విష‌యం తెలిసిందే. అనంత‌రం క్యాంటీన్‌ను సీజ్ చేసి, నిర్వాహకుల లైసెన్స్‌నూ రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

అయితే, ఆ స‌మ‌యంలో ఈవో కార్యాల‌యం వ‌ద్ద బైఠాయించి నిర‌స‌న తెలిపినందుకు గాను టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై దేవాదాయ శాఖ‌ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం, అనుమ‌తి లేకుండా కార్యాల‌యానికి రావ‌డంపై ఈ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నేడు ధూళిపాళ్ల న‌రేంద్ర‌తో పాటు 93 మందిపై కేసులు న‌మోదు చేశారు.
Dhulipala Narendra Kumar
Telugudesam
Andhra Pradesh

More Telugu News