Nara Lokesh: టీటీడీ అంటే క్విడ్ ప్రోకో డబ్బుతో పెట్టుకున్న సూట్ కేస్ కంపెనీ కాదు: వైవీ సుబ్బారెడ్డిపై నారా లోకేశ్ ఫైర్

  • టీటీడీ అంటే కోట్లాది మంది హిందువుల నమ్మకమన్న లోకేశ్ 
  • సర్వదర్శనం టోకెన్ల పంపిణీలో ముగ్గురు గాయపడినా స్పందించరా? అంటూ ప్రశ్న 
  • భక్తులు అగచాట్లు పడుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్న టీడీపీ నేత 
Nara Lokesh fires on YV Subba Reddy

సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈరోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంతో మంది శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుతున్న ఎండల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు అల్లాడిపోయారు. తొక్కిసలాటలో కొందరు గాయపడగా వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 

'వైవీ సుబ్బారెడ్డి గారూ... లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవడానికి టీటీడీ మీరు క్విడ్ ప్రోకో ద్వారా దోచుకున్న లక్షల కోట్లతో పెట్టుకున్న సూట్ కేసు కంపెనీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల నమ్మకం. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో నెల‌కొన్న గంద‌ర‌గోళం, పంపిణీలో అస్త‌వ్య‌స్త ప‌ద్ధ‌తితో జ‌రిగిన‌ తొక్కిస‌లాటలో ముగ్గురు గాయ‌ప‌డినా మీరు స్పందించ‌రా? మండే ఎండ‌లో టోకెన్ల కోసం చిన్న‌పిల్ల‌లు, వృద్ధులైన శ్రీవారి భ‌క్తుల‌ను అష్ట‌క‌ష్టాలు పెట్ట‌డం మీకు న్యాయ‌మేనా? శ్రీవారి సేవ‌లు, టికెట్లు, ప్ర‌సాదం రేట్లు మూడింత‌లు పెంచ‌డంపై వున్న ఆరాటం... భ‌క్తుల‌కి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో లేదు. వీఐపీల సేవ‌లో త‌రిస్తోన్న టీటీడీ... సామాన్య భ‌క్తులు నానా అగ‌చాట్లు ప‌డుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం తీవ్ర విచార‌క‌రం' అని ట్వీట్ చేశారు.

More Telugu News