Ali: డాక్టర్ పట్టా పుచ్చుకున్న కమెడియన్ అలీ కుమార్తె

Ali daughter Fatima becomes a doctor
  • అలీకి ముగ్గురు పిల్లలు
  • డాక్టర్ అయిన పెద్ద కుమార్తె ఫాతిమా
  • తమ కుటుంబంలో మొదటి డాక్టర్ అంటూ ఆనందం 
సాధారణంగా సినీ తారల సంతానం సినిమా రంగంలోనే తమ కెరీర్ ను వెదుక్కుంటారు. అయితే, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కుమార్తె ఫాతిమా మాత్రం అందుకు భిన్నంగా వైద్య వృత్తిని ఎంచుకుంది. ఆమె ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. పుత్రిక ప్రయోజకురాలు కావడంతో ఆలీ ఆనందం అంతాఇంతా కాదు. ఫాతిమా తమ కుటుంబంలో మొదటి డాక్టర్ అని అలీ దంపతులు సంతోషంగా వెల్లడించారు. కాగా, అలీకి ముగ్గురు పిల్లలు అన్న విషయం తెలిసిందే. వారిలో ఫాతిమా పెద్ద కుమార్తె. తన పిల్లల్లో ఒకరు డాక్టర్ అవ్వాలన్నది అలీ కోరిక.
Ali
Fatima
Doctor
Tollywood

More Telugu News