Sanjay Dutt: పెళ్లి తర్వాత త్వరగా పిల్లల్ని కను.. రణబీర్ కు సంజయ్ దత్ సలహా

Sanjay Dutt tells Ranbir Kapoor to make kids soon after wedding with Alia Bhatt
  • పెళ్లి అంటే పరస్పర నిబద్ధత అన్న సంజయ్ 
  • దానికి కట్టుబడి ఉండాలని సూచన 
  • జీవితాంతం సంతోషం, కీర్తితో వర్ధిల్లాలని విషెస్ 
పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ జంట అలియాభట్, రణబీర్ కపూర్ కు సీనియర్ నటుడు సంజయ్ దత్ శుభాకాంక్షలు తెలిపారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో సంజయ్ దత్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తెలిసిందే. రణబీర్, అలియా భట్ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు కొద్ది మందికి తప్పించి ఇతరులకు ఆహ్వానం లేదని తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యే అవకాశం ఉంది. రిసెప్షన్ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా రణబీర్ వివాహం విషయమై సంజయ్ దత్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘రణబీర్ కపూర్ పెళ్లి చేసుకునేట్టు అయితే నిజంగా నాకు సంతోషమే. అలియా నా ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. వివాహం అన్నదానిపై ఒకరి పట్ల మరొకరు నిబద్ధత కలిగి ఉండడం, కొంత రాజీ పడడం అవసరం. దానికి వారు కట్టుబడి ఉండాలి. ఒకరి చేయి మరొకరు పట్టుకుని సంతోషం, శాంతి, కీర్తితో  జీవితంలో ముందుకు సాగిపోవాలి. రణబీర్ త్వరగా పిల్లల్ని కను. సంతోషంగా ఉండు’’ అని సంజయ్ అన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం ఈ నెలలోనే ఉంటుందన్న వార్తలు వచ్చాయి కానీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.
Sanjay Dutt
Ranbir Kapoor
wedding
sanjay dutt

More Telugu News