Pawan Kalyan: కౌలు రైతు రామ‌కృష్ణ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి రూ.ల‌క్ష చెక్ ఇచ్చిన ప‌వన్ క‌ల్యాణ్‌

pawan  reaches satyasai district
  • సత్యసాయి జిల్లా కొత్త చెరువు విజయనగర్ కాలనీలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌
  • అప్పుల బాధతో ఇటీవ‌ల‌ మృతి చెందిన కౌలు రైతు రామకృష్ణ
  • జ‌న‌సేన‌ తరఫున ఆయ‌న‌ కుటుంబానికి అండగా ఉంటామన్న‌ పవన్
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సత్యసాయి జిల్లా కొత్త చెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. రామ‌కృష్ణ‌ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్‌ అందజేశారు. 
                    
ఆ కౌలు రైతు కుటుంబ సభ్యులను పరామ‌ర్శించారు. జ‌న‌సేన‌ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. పవన్ తో పాటు జ‌న‌సేన‌ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు కూడా ఉన్నారు. రామ‌కృష్ణ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి కౌలు రైతుల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్నారు. 

సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి ప్రారంభ‌మైన జ‌న‌సేన‌ యాత్రలో భాగంగా 28 మంది కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. వారంద‌రికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఏపీలో ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న‌ వివరాలను జనసేన ఇప్ప‌టికే సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. దాని ప్రకారమే ఆయా జిల్లాల్లో కౌలు రైతుల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. కాసేప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట, మన్నీల గ్రామాల‌కు చేరుకుంటారు. 
Pawan Kalyan
Janasena
Anantapur District

More Telugu News