Irfan Pathan: ముంబై ఇండియన్స్ ఘోర ఓటములకు ఇదే కారణం: ఇర్ఫాన్ పఠాన్

Fast bowling failure is main reason for Mumbai Indians failures says Irfan Pathan
  • ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై
  • ఈ సారి వరుస పరాజయాలతో ఉసూరుమనిపిస్తున్న వైనం
  • ఫాస్ట్ బౌలర్లు విఫలం కావడమే కారణమన్న ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఘోరంగా విఫలమవుతోంది. వరుసగా నాలుగు పరాజయాలను పొంది అభిమానులను ఉసూరుమనిపిస్తోంది. జట్టు కూర్పులో రకరకాల మార్పులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. జట్టులో బుమ్రాకి అండగా నిలిచే బౌలర్ కనిపించడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదో సమస్యగా పరిణమించింది.

 ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని పిచ్ లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని... అశ్విన్ స్పిన్ తో రాణిస్తున్నప్పటికీ, ఫాస్ట్ బౌలర్లు విఫలం అవుతుండటమే ముంబై ఓటములకు ముఖ్య కారణమని అన్నాడు.
Irfan Pathan
Mumbai Indians
IPL

More Telugu News