చిన్న‌మ్మ‌కు షాక్‌... అన్నాడీఎంకేతో సంబంధం లేద‌న్న కోర్టు

  • శ‌శిక‌ళ‌ను స‌స్పెండ్ చేస్తూ అన్నాడీఎంకే తీర్మానం
  • తీర్మానాన్ని సెష‌న్స్ కోర్టులో స‌వాల్ చేసిన చిన్న‌మ్మ‌
  • శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పిన కోర్టు
  • హైకోర్టును ఆశ్ర‌యిస్తాన‌న్న శ‌శిక‌ళ‌
tamilnadi ssessions court rules out shashikala petetion

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సోమ‌వారం నాడు మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, చిన్న‌మ్మ‌గా ఆ పార్టీ నేత‌లు భావించే శ‌శిక‌ళ‌కు త‌మిళ‌నాడుకు చెందిన సెష‌న్స్‌ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శ‌శిక‌ళ‌కు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు అన్నాడీఎంకే తీర్మానాన్ని స‌వాల్ చేస్తూ శ‌శిక‌ళ దాఖ‌లు చేసిన‌ ఓ పిటిష‌న్‌ను విచారించిన సెష‌న్స్ కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 

శ‌శిక‌ళ‌ను అన్నాడీఎంకే నుంచి స‌స్పెండ్ చేస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం చెల్లుబాటు అవుతుంద‌ని కూడా సెష‌న్స్‌ కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా సెష‌న్స్ కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. అయితే సెష‌న్స్ కోర్టు కేవ‌లం అన్నాడీఎంకే పార్టీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైనే స్పందించింద‌న్న శ‌శిక‌ళ‌.. తాను సెష‌న్స్ కోర్టు తీర్పును హైకోర్టులో స‌వాల్ చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

More Telugu News