AP Cabinet: ఏపీ డిప్యూటీ సీఎంలుగా ఐదుగురు.. మ‌హిళకు ద‌క్క‌ని చోటు

five ministers of ap are ap deputy cms
  • పాత డిప్యూటీ సీఎంల‌లో ఇద్ద‌రికి చోటు
  • కొత్త మంత్రుల్లో ముగ్గురికి డిప్యూటీ సీఎం పోస్టులు
  • ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల జారీ
ఏపీ కేబినెట్‌లో గ‌తంలో మాదిరే తాజాగా పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం కేబినెట్ పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ప్ర‌క‌టిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

పాత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంలుగా కొన‌సాగిన వారిలో క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి (ఎస్సీ), అంజాద్ బాషా (మైనారిటీ)ల‌కు ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ద‌క్కాయి. కొత్త‌గా పీడిక రాజ‌న్న‌దొర (ఎస్టీ), కొట్టు స‌త్య‌నారాయ‌ణ (కాపు), బూడి ముత్యాల‌నాయుడు (బీసీ)ల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ద‌క్కాయి. అయితే డిప్యూటీ సీఎంగా ఈ ద‌ఫా మ‌హిళ‌కు స్థానం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
AP Cabinet
YS Jagan
Andhra Pradesh
Dyputy CM

More Telugu News