త‌ల్లి కాబోతున్న‌ట్లు తెలిపిన సినీ న‌టి ప్ర‌ణీత‌

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌ణీత‌ పోస్ట్ 
  • త‌న భ‌ర్త‌ 34వ పుట్టినరోజు నేడు అని వివ‌ర‌ణ‌
  • దేవుడు త‌మ‌కు గొప్ప‌ బహుమతి ఇచ్చాడ‌న్న ప్ర‌ణీత‌
pranita announces her pregnancy

తాను త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న‌ట్లు తెలుపుతూ సినీ న‌టి ప్ర‌ణీత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. త‌న భ‌ర్త‌ నితిన్‌ రాజు (బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త) 34వ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. దేవుడు త‌మ‌కు గొప్ప‌ బహుమతి ఇచ్చాడ‌ని తెలిపింది. 

ప్రణీతకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ప్రణీత పలు సినిమాల్లో నటించిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన 'అత్తారింటికి దారేది', జూనియ‌ర్ ఎన్టీఆర్ 'ర‌భస', మ‌హేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాల్లో ఆమె న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. కొవిడ్ స‌మ‌యంలో ఆమె పేద‌ల‌కు సాయం చేసింది.

More Telugu News