Andhra Pradesh: ఎమ్మెల్యే పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా.. పార్టీకి నష్టం చేయొద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి

Sucharita Officially Declared That She Is Resigning For MLA Post
  • పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
  • మిగతా నేతలు రాజీనామా చేయవద్దని సూచన
  • పార్టీ కార్యకర్తలతో భేటీ తర్వాత నిర్ణయం ప్రకటించిన సుచరిత
మరోసారి మంత్రి పదవి రాకపోవడంతో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మనస్తాపం చెందారు. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొన్నటిదాకా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న ఆమెకు.. ఈసారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారన్న వార్తలు వినిపించాయి. నిన్న ఆమె కుమార్తె ఈ విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయాన్ని సుచరిత అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. అయితే, ఆమెకు మద్దతుగా ప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
Andhra Pradesh
YSRCP
Mekathoti Sucharitha
MLA

More Telugu News