Roja: 'ఆర్కే రోజా అనే నేను..' .. కల నెరవేర్చుకున్న ఫైర్ బ్రాండ్!

Roja takes oath as minister
  • రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా
  • ప్రమాణం అనంతరం జగన్ కు పాదాభివందనం చేసిన వైనం
  • 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా తన కోరికను నెరవేర్చుకున్నారు. మంత్రి కావాలనే తన చిరకాల వాంఛను నిజం చేసుకున్నారు. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 'ఆర్కే రోజా అనే నేను..' అంటూ ప్రమాణం చేశారు. అనంతరం తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ఆమె పాదాభివందనం చేశారు. ఆప్యాయంగా ఆయన చేతిని ముద్దాడారు. 

రోజా చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె వయసు 51 సంవత్సరాలు. రోజా విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ. చదువుకునే దశలోనే ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో రెండోసారి విజయదుందుభి మోగించారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన రోజాకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా జగన్ బాధ్యతలను అప్పగించారు. రెండేళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కేబినెట్ లోకి అడుగుపెట్టారు.
Roja
Minister
Oath
Jagan

More Telugu News