వైజాగ్ రోడ్లపై విలన్ గ్యాంగ్ తో 'ఏజెంట్' అఖిల్ ఫైట్!

  • 'ఏజెంట్' గా అఖిల్
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • కీలకమైన పాత్రలో మమ్ముట్టి 
  • ఆగస్టు 12వ తేదీన విడుదల   
Agent movie update

అఖిల్ తాజా చిత్రంగా 'ఏజెంట్' సెట్స్ పై ఉంది. వక్కంతం వంశీ అందించిన కథతో ఈ సినిమాను సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగులో జరుగుతోంది. అక్కడి రోడ్లపై అఖిల్ తదితరులపై ఒక యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్ పైనే ఇంట్రవెల్ బ్యాంగ్ రానుందని అంటున్నారు.

 సురేందర్ రెడ్డి 'ధ్రువ'లో చరణ్ ను ఎంత స్టైలీష్ గా చూపించాడో, ఈ సినిమాలో అఖిల్ ను కూడా అంతే స్టైల్ గా చూపించనున్నాడని తెలుస్తోంది. అఖిల్ సరసన నాయికగా సాక్షి వైద్య తెలుగు తెరకి పరిచయం కానుంది. మమ్ముట్టి కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News