Prashant Neel: ఎన్టీఆర్ తో చేసే సినిమా ఏ జానర్ అని మాత్రం అడగొద్దు: ప్రశాంత్ నీల్

  • ఎన్టీఆర్ కు స్క్రిప్టు వినిపించిన ప్రశాంత్ నీల్
  • ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని వెల్లడి
  • తాను 20 ఏళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్ నని వ్యాఖ్యలు
  • రెండేళ్లుగా సాన్నిహిత్యం పెరిగిందని వివరణ
Prashant Neel says do not ask what genre he will be done with NTR

కేజీఎఫ్ చిత్రంతో ఆలిండియా స్థాయిలో గుర్తింపుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందించారు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ తో తనకు సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానినైన తాను ఇప్పుడాయనతో ఓ ప్రాజెక్టు కోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలిపారు.

ఎన్టీఆర్ కు స్క్రిప్టు బాగా నచ్చిందని, అయితే ఆయనతో చేయబోయే సినిమా ఏ జానర్ అని మాత్రం తనను అడగొద్దంటూ అందరినీ సస్పెన్స్ లో ముంచెత్తారు. ఇప్పటికే స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ ను పది, పదిహేను పర్యాయాలు కలిసుంటానని వివరించారు. 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు, ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం పట్టాలెక్కనుంది.

More Telugu News