Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి... శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Komatireddy appointed as Congress Party Star Campaigner in Telangana
  • కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్
  • కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగింత
  • సోనియా గాంధీ ఆమోదం
  • ఏఐసీసీ నుంచి ప్రకటన
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిన నేపథ్యంలో అసంతృప్తికి గురయ్యాడని భావిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తాజాగా కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డిని నియమించింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

కాగా, పార్టీ సహచరుడు  కొత్త బాధ్యతలు అందుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సోదరా అంటూ ట్వీట్ చేశారు.
Komatireddy Venkat Reddy
Star Campaigner
Congress
Sonia Gandhi
Telangana

More Telugu News