air conditioner: ఏసీ బిల్లు తగ్గించుకునే మార్గాలు ఇవే..

  • టెంపరేచర్ ను 24-28 మధ్య సెట్ చేసుకోవాలి
  • తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి
  • డోర్స్, విండోలు సరిగ్గా మూయాలి
  • టైమర్ తో విద్యుత్ ఆదా
quick tips to cut down on your AC bill this summer

వేసవి వచ్చిందంటే ఏసీ ఉండాల్సిందే. అంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. కొద్దో గొప్పో స్థోమత ఉన్న వారు కూడా ఇళ్లలో ఏసీలను ఫిట్ చేయించుకుంటున్నారు. ఏసీల విద్యుత్ వినియోగం ఇంటిలోని ఇతర ఉపకరణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో విద్యుత్ బిల్లు భారీగా వస్తుంది. బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు చాలా మంది భారంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఏసీ బిల్లు భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించడం మంచి ఆలోచన అవుతుంది.

సరైన ఉష్ణోగ్రత
చాలా మంది ఏసీలను 16-20 డిగ్రీల మధ్యలో నడిపిస్తుంటారు. చల్లదనం కోసం ఇలా చేస్తుంటారు. కానీ, మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. కనుక దీనికంటే తక్కువలో ఏసీ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. 24-28 మధ్య ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకోవడం వల్ల సరిపడా చల్లదనంతోపాటు విద్యుత్ ఆదా అవుతుంది. 16 డిగ్రీల ఉష్ణోగ్రతలో నడిపించినప్పుడు చల్లధనం ఎక్కువ వృధా అవుతుందని గుర్తించాలి.

వాడనప్పుడు కట్టేయాలి
ఏసీ అనే కాదు, టీవీ మరే ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణం అయినా వాడనప్పుడు పవర్ ఆఫ్ చేయాలి. చాలా మంది రిమోట్ లో ఏసీని ఆఫ్ చేస్తుంటారు. కానీ, అది పూర్తిగా కట్టేసినట్టు కాదు. ఏసీ వరకు విద్యుత్ సరఫరా అవుతుంటుంది. దానివల్ల కూడా కొత ఇంధనం వృధాగా పోతుంది.

టైమర్
అన్ని ఏసీలు టైమర్ ఆప్షన్ తో వస్తున్నాయి. అంటే రాత్రి నిద్రించిన తర్వాత కొన్ని గంటలకు ఏసీ ఆఫ్ అయ్యేలా ఈ ఫీచర్ సాయపడుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. 

సర్వీసింగ్
అన్నింటికంటే ముఖ్యంగా ఏసీలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడవం అవసరం. ఎందుకంటే ఏసీ ఫిల్టర్లలో డస్ట్ చేరి ఉంటుంది. ఇదంతా శుభ్రం కావాలంటే సర్వీసింగ్ అవసరం. పైగా వేసవిలో వాడే వారే ఎక్కువ. మిగిలిన కాలాల్లో అసలు ఏసీ వేయరు. అటువంటి వారు సర్వీసింగ్ చేయించిన తర్వాతే వేసవిలో ఏసీ ఆన్ చేయాలి. 

డోర్స్, విండోలు
ఏసీ ఉన్న గదిలో వెంటిలేషన్ గమనించాలి. ఎక్కడా సందులు ఉండకూడదు. దీనివల్ల ఎంతో ఏసీ వృధా అవుతుంటుంది. పైగా ఏసీ గదిలో ఇనుప వస్తువులు (అల్మారా), వస్త్రాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే మీరుండే అంతస్తుకు పైన మరో అంతస్తు లేకపోతే.. ఏసీ గదికి సీలింగ్ చేసుకోవాలి. లేదంటే ఎండ ప్రభావానికి రూఫ్ ఎంతో వేడెక్కుతుంటుంది. దీంతో ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది.

More Telugu News