Varla Ramaiah: హోం మంత్రి సుచరిత గారిని తొలగించడం మంచిది కాదేమో: వ‌ర్ల రామ‌య్య‌

varlaramaiah slams jagan
  • కొత్త‌ మంత్రి మండలి విష‌యంలో వ‌ర్ల రామ‌య్య ట్వీట్
  • కొడాలి నానిని కొనసాగించాలని చూడడం మంచిది కాదేమోన‌ని వ్యాఖ్య‌
  • మాట తప్పకండి, మడమ కూడా తిప్ప‌కండి అని స‌ల‌హా

ఏపీలో కొత్త మంత్రుల జాబితా నేడు ఖరారు కానున్న విష‌యం తెలిసిందే. ఆ జాబితాను ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 

'ముఖ్యమంత్రి గారూ.. నోరు లేని మా దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించి, కొత్త‌ మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడడం మంచిది కాదేమో, ఆలోచించండి. అన్న మాట మీద నిలబడి అందరినీ పీకేయండి సార్. మాట తప్పకండి, మడమ కూడా తిప్ప‌కండి. ఎవరి సలహాలూ వినకండి' అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు.  


  • Loading...

More Telugu News