Kuchipudi: తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసిన సితార‌.. వీడియో పోస్ట్ చేసిన మ‌హేశ్ బాబు

urstrulyMahesh Sitaras first Kuchipudi dance recital
  • చాలా సంతోషంగా ఉందన్న మ‌హేశ్‌
  • రాముడి గొప్ప‌ద‌నాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుందని ట్వీట్
  • ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు
సినీ న‌టుడు మ‌హేశ్ బాబు కూతురు సితార తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ''సితార మొద‌టి కూచిపూడి డ్యాన్స్ ఇది. ప‌విత్ర శ్రీ‌రామ‌న‌వమి రోజున ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్ప‌ద‌నాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది'' అని సితార వీడియోను మ‌హేశ్ బాబు పోస్ట్ చేశారు. 

               
త‌మ కూతురికి కూచిపూడి నేర్పించిన వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు మ‌హేశ్ బాబు పేర్కొన్నారు. సితార చేసిన డ్యాన్స్‌పై మ‌హేశ్ బాబు అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.
Kuchipudi
Mahesh Babu
Tollywood

More Telugu News