Gaali Vaana: హైదరాబాదులో ఘనంగా 'గాలివాన' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • జీ5 ఓటీటీలో త్వరలో గాలివాన వెబ్ సిరీస్
  • సాయికుమార్, రాధిక ప్రధానపాత్రల్లో వెబ్ సిరీస్
  • ఈ నెల 14న స్ట్రీమింగ్
  • బీబీసీ, నార్త్ స్టార్ భాగస్వామ్యం
Gaali Vaana pre release event held in Hyderabad

జీ 5... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. జీ5 లో త్వరలో ‘గాలివాన’ పేరుతో ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ ప్రసారం కానుంది. 

జీ5 ఓటీటీ సంస్థ, బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. 

సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్‌ కుమార్‌, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్‌ సిరీస్‌తో ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ ప్రాంతీయ వినోదరంగంలోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్‌ శరణ్‌ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 14న జీ5 లో  స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తాజ్ బంజారా లో జీ5 యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటి రాధిక  మాట్లాడుతూ... "తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పటినుంచో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. శరత్ గారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. తనను చిరంజీవి గారి దగ్గర చూసేదాన్ని. ఆయన నన్ను కలిసి వెబ్‌ సిరీస్‌ కథ చెప్పడం జరిగింది. 

నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్‌ సిరీస్‌ చేయలేదు. సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేశాను. ముందు కథ విందామని ఈ కథ వినడం జరిగింది. కథ నచ్చడంతో ఈ 'గాలివాన' వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. కథ అయితే అందంగా చాలా బాగా చెప్పారు. దీన్ని ఎలా తీస్తారో అనుకున్నాను.ఇక్కడ వచ్చిన తర్వాత ఈ టీం డెడికేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. మంచి ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి  చాలా బాగా డీల్ చేశాడు. 

అలాగే నేను ఒక మంచి పాత్ర చేసిందుకు గర్వంగా ఉంది. సాయికుమార్‌గారు కూడా అద్భుతంగా నటించాడు. తనతో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. "గాలివాన" లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది" అని వివరించారు.

నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ..."అందరూ డైలాగ్ కింగ్ సాయికుమార్ అంటారు. కానీ ఈ స్వరం నాకు నాన్నగారిచ్చారు. సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అనుగ్రహం ఆ భగవంతుడిది. ఆశీర్వాదం, అభిమానం మీ అందరిదీ. అలా 'పోలీస్ స్టోరీ' ద్వారా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మొదట కన్నడ లో విడుదలైన పోలీస్ స్టోరీ సినిమా ద్వారా అక్కడి ప్రజలు నన్ను హీరోని చేశారు. అక్కడి నుంచి ఎన్నో అద్భుతమైన వేషాలు వేయడం జరిగింది. 

సావిత్రి గారి దగ్గరనుంచి అందరితో వర్క్ చేశాను కానీ.. ఒక్క రాధికా గారితో మాత్రం మిస్ అయింది. మా నాన్న గారు రాధిక గారు నటించిన న్యాయం కావాలి సినిమాలో జడ్జిగా యాక్ట్ చేశాడు. చివరికి ఇప్పుడు రాధిక గారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్‌ వంటి యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ దర్శకుడు, టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. 

ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ అండ్‌ థ్రిల్‌ను కలిగిస్తుంది. వండర్ఫుల్ సబ్జెక్టులో రాధిక గారితో పాటు ఇంతమంచి టీం తో పని చేసే ఆవకాశం ఇచ్చిన శరత్ గారికి, జీ5 వారికి ధన్యవాదాలు ఈ నెల 14న వస్తున్నాం గాలివాన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే ఈ గాలివాన ను సక్సెస్ చేయాలని కోరుతున్నాను" అన్నారు. 

గాలివాన వెబ్ సిరీస్ లో సాయికుమార్‌, రాధిక శరత్‌కుమార్‌, నందిని రాయ్‌, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌, ఆర్‌. రమేష్‌, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్‌, సతీష్‌ సారిపల్లి, నానాజీ, నవీన్‌, సూర్య శ్రీనివాస్‌, జయచంద్ర తదితరులు నటించారు.

More Telugu News