Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫైట్ చేస్తే... 'హరిహర వీరమల్లు' ప్రీ షూట్ వీడియో ఇదిగో!

Pawan Kalyan fighting sequences video from Harihara Veeramallu
  • పవన్ కల్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు
  • క్రిష్ దర్శకత్వంలో చిత్రం
  • హైదరాబాదులో పవన్ పై పోరాట సన్నివేశాల చిత్రీకరణ
  • పవన్ విన్యాసాలతో వీడియో
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ చిత్రబృందం తాజాగా పవన్ కల్యాణ్ పై చిత్రీకరించిన ప్రీ షూట్ సెషన్ వీడియోను విడుదల చేసింది. 

హైదరాబాదులో వేసిన భారీ సెట్టింగుల నడుమ పవన్ కల్యాణ్ పై గత కొన్నిరోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయా సన్నివేశాలకు ముందు పవన్ ఏ విధంగా సాధన చేశారన్నది ఈ ప్రీ షూట్ వీడియోలో చూపించారు. 

అక్రమార్కులకు వ్యతిరేకంగా ఓ పోరాట యోధుడు ప్రదర్శించిన పరాక్రమం, నైపుణ్యాలను ఈ వీడియోలో చూడొచ్చని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Pawan Kalyan
Harihara Veeramallu
Pre Shoot Session
Video
Krish
Tollywood

More Telugu News