Sonam Kapoor: బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ

Burglars robbed Sonam Kapoor house in Delhi
  • రూ.1.41 కోట్ల విలువైన సొత్తు దొంగతనం
  • ఇంట్లో పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గర్భవతి కావడంతో ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్న సోనమ్

బాలీవుడ్ అందాల నటి సోనమ్ కపూర్ నివాసంలో భారీ చోరీ జరిగింది. గర్భవతిగా ఉన్న సోనమ్ కపూర్ ప్రస్తుతం తన తల్లి వద్ద ఉంటున్నారు. అయితే ఇటీవల ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్టు గుర్తించారు. లోపల అల్మైరాల్లో ఉండాల్సిన నగలు, నగదు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1.41 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు మాయం అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కాగా, ఈ చోరీ ఫిబ్రవరి 23న జరిగినట్టు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సోనమ్ కపూర్ నివాసంలోని పనివాళ్లను, డ్రైవర్, తోటమాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజిని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఈ నివాసంలో సోనమ్ భర్త ఆనంద్ ఆహూజా తల్లిదండ్రులతో పాటు అతడి బామ్మ కూడా ఉంటున్నారు.

  • Loading...

More Telugu News