New Delhi: బైక్ పై ఏకబిగిన 2,400 కిలోమీటర్లు ప్రయాణించిన 56 ఏళ్ల మహిళ!

Woman In Her 50s Achieves Risky Task By Riding Bike From Delhi To Leh
  • తాను అనుకున్నది సాధించిన మహిళ
  • తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో లక్ష్య సాధన
  • ఢిల్లీ–లేహ్ కు 18 రోజుల్లో బుల్లెట్ పై ప్రయాణం

ఒక్క మూడు గంటలు బస్సులో జర్నీ చేస్తేనే అలసిపోతుంటారు కొందరు. బైకు మీద ప్రయాణమంటేనే హడలిపోతుంటారు. అలాంటిది ఏకబిగిన 18 రోజుల పాటు 2,400 కిలోమీటర్లు ప్రయాణించిందో మహిళ. అది కూడా 56 ఏళ్ల వయసులో. కేరళకు చెందిన మినీ ఆగస్టీన్ అనే పెద్దావిడ.. ఢిల్లీ నుంచి లేహ్ వరకు బైకు మీదే ప్రయాణం చేసింది. ట్రావెలింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో, తపనో ఈ ప్రయాణం ద్వారా అందరికీ తెలియజేసింది. 

తన సోదరులకు దీటుగా ఆమెను తల్లిదండ్రులు పెంచారు. సోదరులతో కలిసి మొదట సైకిల్ తొక్కిన ఆమె.. ఆ తర్వాత బైక్ రైడింగ్ ను స్టార్ట్ చేశారు. క్రమంగా బైక్ రైడింగ్ పై మక్కువ పెంచుకున్నారు. ఆమె కుటుంబమూ అందుకు అండగా నిలిచింది. తల్లిదండ్రులు, భర్త, పిల్లలు ఎంతో ప్రోత్సహించారు. ఆమె భర్త ఆమెకు 350 సీసీ బుల్లెట్ ను నడపడం నేర్పించారు. 

ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆమె ట్రావెలింగ్ లైఫ్ ను మొదలుపెట్టారు. అయితే, అందుకు ఆమె ఏడాది పాటు కఠిన శిక్షణనే తీసుకున్నారు. రోడ్డుపై జాగ్రత్తగా ఉండేందుకు, సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు ప్రతిరోజూ సాధన చేశారు. సక్సెస్ ఫుల్ గా తాను అనుకున్నది సాధించారు. సమాజంలో ఉన్న అసమానతలను తలదన్ని తాను అనుకున్న బైక్ రైడింగ్, ట్రావెలింగ్ లో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

  • Loading...

More Telugu News