IPL: ఐపీఎల్ కు షాక్.. భారీగా తగ్గిన వీక్షకుల సంఖ్య!

  • బీసీసీఐకి షాకిస్తున్న క్రికెట్ అభిమానులు
  • గత ఏడాదితో పోలిస్తే 33 శాతం పడిపోయిన వీక్షకుల సంఖ్య
  • ఐపీఎల్ పై ఆసక్తి తగ్గిందంటున్న వీక్షకులు
Viewership got down to IPL

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ బీసీసీఐకి షాక్ ఇస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో 2023-2027 ప్రసార హక్కులకు భారీ బిడ్డింగ్ వస్తుందనే యోచనలో ఉన్న బీసీసీఐకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అమెజాన్, సోనీ, టీవీ 18 వయాకామ్, డిస్నీ స్టార్ సంస్థలు ఇప్పటి వరకు టెండర్ పత్రాలను కొనుగోలు చేశాయి.

ఆటగాళ్లు ఒక టీమ్ నుంచి మరొక టీమ్ కు మారిపోవడం... ఈ ఏడాది జట్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు ఆటగాళ్ల ఆసక్తిని తగ్గించాయి. మ్యాచ్ లు చూడాలన్న ఆసక్తి కలగడం లేదని పలువురు క్రికెట్ అభిమానులు చెపుతున్నారు. కోహ్లీ, ధోనీలు కెప్టెన్లుగా లేకపోవడం కూడా అభిమానుల ఆసక్తి తగ్గడానికి కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో, టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత ఏడాది తొలి 8 మ్యాచ్ లకు 3.75 శాతం రేటింగ్ రాగా.. ఈ ఏడాది అది 2.52 శాతానికే పరిమితమయింది.

  • Loading...

More Telugu News