XE variant: గుజరాత్ లో రెండు కొత్త రకాల కరోనా కేసుల గుర్తింపు

  • వడోదరలో 60 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ
  • గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కో ఎక్స్ఎం కేసు
  • జీనోమిక్ సీక్వెన్సింగ్ లో నిర్ధారణ
XE variant of coronavirus detected in Gujarat

కరోనా కొత్త రకం మహమ్మారి ఎక్స్ఈ గుజరాత్ లోకి అడుగు పెట్టింది. దేశంలోనే మొదటి ఎక్స్ఈ కేసును గుర్తించినట్టు రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రకటించింది. అయితే, ఇది ఎక్స్ఈ కేసు కాదని, తొందరపడ్డారంటూ కేంద్ర ప్రభుత్వం దానిని ఖండించింది. సదరు శాంపిల్ ను మరోసారి జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని ఆదేశించడం తెలిసిందే.

ఈ క్రమంలో గుజరాత్ లో ఎక్స్ఈ కేసు రావడం గమనార్హం. మిగిలిన కరోనా వేరియంట్ల కంటే ఎక్కువ వేగంగా (10 శాతం) విస్తరించే గుణం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు.  మార్చి 13న వడోదర పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ ఉన్నట్టు గుర్తించగా, రోగి వారం రోజుల్లో కోలుకున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ గా తేలడంతో మరోసారి నిర్ధారించుకునేందుకు శాంపిల్ ను పంపించినట్టు చెప్పారు. 

ఇక కరోనాలో ఎక్స్ఎం అనే కొత్త రకం కేసులు గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కోటి వెలుగు చూశాయి. కరోనా ఒమిక్రాన్ ఉపరకాల కలయికే ఎక్స్ఈ, ఎక్స్ఎం కేసులు. 

More Telugu News