Akira Nandan: అకీరా తెరంగేట్రంపై ఊహాగానాలు.. స్పష్టత నిచ్చిన రేణు దేశాయ్

  • అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేసిన రేణు  
  • సినిమాల్లోకి వచ్చేందుకేనని వార్తలు 
  • అకీరాకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదన్న తల్లి  
 Renu Desai gave Clarity about Akira Nandan Tollywood Entry

పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలపై తల్లి రేణు దేశాయ్ స్పందించారు. అకీరాకు నటుడయ్యే ఉద్దేశం లేదని, అతడు ఏ సినిమాకీ సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు. అకీరా 18వ పుట్టిన రోజును పురస్కరించుకుని రేణు నిన్న ఓ వీడియోను షేర్ చేశారు.

అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అకీరా నటుడిగా మారేందుకే బాక్సింగ్ నేర్చుకుంటున్నాడని కామెంట్ చేశారు. త్వరలోనే అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన రేణు దేశాయ్.. ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News