Janasena: 10న రైల్వే కోడూరులో జనసేన బహిరంగ సభ.. హాజ‌రు కానున్న నాదెండ్ల‌

janasena organising public meeting in railawa kodur on 10ts of this month
  • బ‌హిరంగ స‌భ‌కు ముందు ప‌లు కార్య‌క్ర‌మాల‌కు నాదెండ్ల హాజ‌రు
  • కొత్త‌గా నిర్మించిన పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్న వైనం
  • మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేయ‌నున్న నాదెండ్ల‌
జ‌న‌సేన పార్టీ ఈ నెల 10న‌(ఆదివారం) క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరులో బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటి చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ శుక్ర‌వారం సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

రైల్వే కోడూరు బ‌హిరంగ స‌భ‌లో పాలుపంచుకునేందుకు వెళ్ల‌నున్న నాదెండ్ల ఆ కార్య‌క్ర‌మానికి ముందు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో జ‌న‌సేన తెలిపింది. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల‌కు రైల్వే కోడూరు చేరుకునే నాదెండ్ల అక్క‌డ కొత్త‌గా నిర్మించిన పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తారు. 

అనంత‌రం స్థానిక రైతుల‌తో ముఖాముఖీ నిర్వ‌హించ‌నున్న నాదెండ్ల రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటారు. మ‌హిళా ఉపాధి మేళాలో శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌ల‌కు ఆయ‌న కుట్టు మిష‌న్లు పంపిణీ చేస్తారు. పార్టీ క్రియాశీల స‌భ్య‌త్వ న‌మోదులో స‌త్తా చాటిన కార్య‌క‌ర్త‌ల‌కు మెమొంటోలు అందిస్తారు. ఆ తర్వాత అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ వేదిక‌పై ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.
Janasena
Nadendla Manohar
Railway Kodur
Kadapa District

More Telugu News