సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి పవన్ కల్యాణ్ ఆత్మీయ సత్కారం
- పవన్ హీరోగా హరిహర వీరమల్లు
- క్రిష్ దర్శకత్వంలో చిత్రం
- తోట తరణి నేతృత్వంలో భారీ సెట్టింగులు
- ముగ్ధుడైన పవన్ కల్యాణ్
కాగా, ఈ సినిమా సెట్స్ పై పవన్ కల్యాణ్ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. హైదరాబాదులో హరిహర వీరమల్లు కోసం తోట తరణి అద్భుతమైన సెట్స్ ను రూపొందించడం తెలిసిందే. 17వ శతాబ్దం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఆ సెట్స్ కు విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోంది. ఈ సెట్టింగులను చూసి పవన్ కల్యాణ్ ఎంతో ముగ్ధుడైనట్టు తెలుస్తోంది.

.