Allu Arjun: ఫ్యామిలీతో కలిసి యూరప్ కు బయల్దేరిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో!

Allu Arjun heads to Europe to celebrate his 40th birthday
  • ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే
  • పుట్టినరోజు వేడుకల కోసం యూరప్ కు బయల్దేరిన బన్నీ
  • తిరిగొచ్చిన తర్వాత 'పుష్ప 2' షూటింగ్ లో పాల్గొననున్న అల్లు అర్జున్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈరోజు. నేటితో బన్నీ 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ కు బయల్దేరాడు. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ ఉన్నారు. ఎయిర్ పోర్టులో వీరు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాగా, యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన తర్వాత 'పుష్ప 2' షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటాడని సమాచారం. ఇంకోవైపు తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.  
Allu Arjun
Birthday
Europe
Tollywood

More Telugu News