High Court: రోడ్డు ప‌క్కన‌ కారు ఆపి హోంగార్డును అభినందించిన తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్‌చంద్ర శర్మ

high court cj praises home guard
  • అబిడ్స్ లో ఘ‌ట‌న‌
  • అంకిత‌భావంతో హోంగార్డు విధులు
  • ప్ర‌తిరోజు గ‌మ‌నిస్తోన్న జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌
విధి నిర్వహణలో అంకితభావంతో ప‌నిచేస్తున్నాడు ఓ హోంగార్డు. ఆయ‌న‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ప్ర‌తిరోజు కారులో వెళ్తూ గ‌మ‌నిస్తున్నారు. ఆయ‌న‌ను ఓ రోజు అభినందించాల‌ని భావించారు. 
                
నేడు జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర శ‌ర్మ రోజులాగే త‌న అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తూ రోడ్డు ప‌క్క‌న కారు ఆపి, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హం వ‌ద్ద ట్రాఫిక్ విధులు నిర్వ‌హిస్తోన్న‌ హోంగార్డ్ అష్ర‌ఫ్ అలీని అభినందించారు. అష్ర‌ఫ్ అలీకి పుష్ప‌గుచ్చం అందించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త‌న‌ను అభినందించ‌డంతో అలీ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.   
           
High Court
Hyderabad
traffic

More Telugu News