ఏపీలో అమ‌ల్లోకి ప‌వ‌ర్ హాలిడే.. ప‌రిశ్ర‌మ‌లు రెండు వారాలు బంద్‌

07-04-2022 Thu 21:45
  • 8 నుంచి 22 వ‌ర‌కు ప‌వ‌ర్ హాలిడే
  • ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు 50 శాతం విద్యుత్‌నే వినియోగించాలి
  • 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారంలో ఒక‌రోజు ప‌వ‌ర్ హాలిడే
  • వారాంత‌పు సెల‌వుకు ప‌వ‌ర్ హాలిడే అద‌నం
  • ఏపీఎస్పీడీసీఎల్ ప‌రిధిలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌ర్తింపు
APSPDCL Announces Power Holidays for Industries
ఏపీలో విద్యుత్ కోత‌లు మొద‌లైపోయాయి. వేస‌వి నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో గృహావ‌స‌రాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేలు ప్ర‌క‌టిస్తూ ఏపీ సెంట్ర‌ల్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్‌) సీఎండీ హ‌ర‌నాథ‌రావు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏపీఎస్పీడీసీఎల్ ప‌రిధిలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్నాయి.

ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్ర‌కారం.. 253 ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారంలో ఒక‌రోజు ప‌వ‌ర్ హాలిడేను అమ‌లు చేయాలి. వారాంత‌పు సెల‌వుకు అద‌నంగా ఒక రోజు ప‌వ‌ర్ హాలిడేను కొన‌సాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వ‌ర‌కు రెండు వారాల పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేను ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.