Prithvi Shaw: ఆరంభంలో పృథ్వీ షా దూకుడు... ఆపై ఢిల్లీని కట్టడి చేసిన లక్నో

  • ముంబయిలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు చేసిన ఢిల్లీ
  • 34 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పృథ్వీ షా
LSG restricts Delhi Capitals for 149 runs

యువ ఓపెనర్ పృథ్వీ షా ఫామ్ చూస్తే ఢిల్లీ స్కోరు 200 దాటుతుందని అనిపించినా, లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా కట్టడి చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. పృథ్వీ షా 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 61 పరుగులు సాధించాడు. 

మరో ఎండ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ సింగిల్ డిజిట్ స్కోరులో ఉండగానే, పృథ్వీ షా అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే, పృథ్వీ షా... కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్ లో అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు మందగించింది. ఆ వెంటనే వార్నర్ (4)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. ఢిల్లీ జట్టు తరఫున ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడోనని ఎదురుచూసిన అభిమానులకు వార్నర్ నిరాశనే మిగిల్చాడు. 

ఆ తర్వాత రవి బిష్ణోయ్ వెస్టిండీస్ ఆటగాడు రోవ్ మాన్ పావెల్ ను అవుట్ చేయడంతో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (39 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు కానీ, స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

More Telugu News