Amaravati: ఢిల్లీలోనే అమ‌రావ‌తి రైతులు... కేంద్ర మంత్రులు గ‌డ్క‌రీ, ఠాకూర్‌ల‌తో భేటీ

amaravati farmers met nitin gadkari and anurag thakur in delhi
  • అమ‌రావ‌తి ప‌రిస్థితిని మంత్రులకు వివరించిన రైతులు  
  • రైతుల వెంట వెళ్లిన‌ రేణుకా చౌద‌రి, సుంక‌ర ప‌ద్మ‌శ్రీ
  • గడ్కరీతో భేటీ స‌మ‌యంలోనే వ‌చ్చిన కిష‌న్ రెడ్డి
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించేలా యత్నిస్తున్న రాజ‌ధాని రైతులు ప్రస్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన రాజ‌ధాని రైతులు.. గురువారం నాడు కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, అనురాగ్ సింగ్ ఠాకూర్‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు రాజధాని అమ‌రావ‌తి ప్ర‌స్తుత ప‌రిస్థితి, రాజ‌ధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, మూడు రాజ‌ధానుల దిశ‌గా సాగుతున్న జ‌గ‌న్ స‌ర్కారు వైఖ‌రిల‌ను కేంద్ర మంత్రుల‌కు వివ‌రించారు.

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో భేటీకి అమ‌రావ‌తి రైతుల‌కు తోడుగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు రేణుకా చౌద‌రి, సుంక‌ర ప‌ద్మ‌శ్రీలు కూడా మంత్రి నివాసానికి వెళ్లారు. కేంద్ర మంత్రితో అమ‌రావ‌తి రైతులు చ‌ర్చిస్తుండ‌గానే.. అక్క‌డికి తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ‌చ్చారు. కిష‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే అమ‌రావ‌తి రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను నితిన్ గ‌డ్క‌రీకి విన్న‌వించారు.
Amaravati
AP Capital
Amaravati Farmers
Nitin Gadkari
Kishan Reddy

More Telugu News