Perni Nani: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని కీల‌క వ్యాఖ్య‌లు

perni nani comments on pawan kalyan
  • ప‌వ‌న్ ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాదన్న నాని 
  • హాబీగానే ప‌వ‌న్‌ రాజ‌కీయాలు చేస్తున్నారని వ్యాఖ్య 
  • ప‌వ‌న్ ఒంటినిండా చంద్ర‌బాబేన‌న్న మంత్రి 
 తాజాగా అందరితో పాటు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన పేర్ని నాని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాద‌ని ఆయన వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హాబీగా మాత్ర‌మే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయన ఎద్దేవా చేశారు.

  ఏపీ కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రివ‌ర్గంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వివ‌రించేందుకు వ‌చ్చిన పేర్ని నాని.. ప‌వ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గతంలో క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి బీజేపీని తిట్టిన ప‌వన్‌.. ఇప్పుడు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబుతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆరోపించారు. ఒక‌ప్పుడు జ‌న‌సేన కార్యాల‌యాల్లో చెగువెరా ఫొటోలు ఉంటే... ఇప్పుడు ప‌వ‌న్ ఒంటి నిండా చంద్ర‌బాబే ఉన్నారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Perni Nani
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News