David Warner: ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో... అందరి దృష్టి వార్నర్ పైనే!

David Warner plays first time for Delhi Capitals in IPL
  • ముంబయిలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
  • గతంలో సన్ రైజర్స్ కు ఆడిన వార్నర్
  • వేలంలో వార్నర్ ను కొనుగోలు చేసిన ఢిల్లీ
ఐపీఎల్ తాజా సీజన్ ఉత్సాహభరితంగా సాగుతోంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

కాగా, ఈ పోరులో అందరి దృష్టి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ పై ఉండనుంది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన వార్నర్... కొన్ని పరిణామాల వల్ల ఆ జట్టుకు దూరమయ్యాడు. దాంతో, ఈసారి నిర్వహించిన మెగా వేలంలో వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో సన్ రైజర్స్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వార్నర్, ఢిల్లీ జట్టు తరఫున ఏ రీతిలో చెలరేగుతాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

నేటి మ్యాచ్ కోసం లక్నో జట్టులో ఒక మార్పు చేశారు. మనీష్ పాండే స్థానంలో కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టులో వార్నర్ కోసం కివీస్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ ను తప్పించారు. అంతేకాదు, ఖలీల్ అహ్మద్ స్థానంలో నోర్జే, మన్ దీప్ స్థానంలో సర్ఫరాజ్ ను తీసుకున్నారు.
David Warner
Delhi Capitals
Sunrisers
LSG
IPL

More Telugu News