AP Cabinet: బొత్స ఛాంబ‌ర్‌లో న‌లుగురు మంత్రులు.. ఏం చ‌ర్చించారంటే..!

  • కేబినెట్ భేటీ ముగిశాక ఇళ్ల‌కు మంత్రులు
  • బొత్స ఛాంబ‌ర్‌లో న‌లుగురు మంత్రుల ప్ర‌త్యేక భేటీ
  • బొత్స‌, క‌న్న‌బాబు, అవంతి, తానేటిల స‌మావేశం
  • తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించిన మంత్రులు
four ministers met in botsa chamber

ఏపీ మంత్రివ‌ర్గంలోని మొత్తం 24 మంది మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం ఏపీ స‌చివాలయంలో జ‌రిగిన కేబినెట్ భేటీలో జ‌గ‌న్ ఆదేశించగానే.. మంత్రులంతా మూకుమ్మ‌డిగా ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. ఆ త‌ర్వాత కేబినెట్ భేటీ ముగియ‌గా.. దాదాపు మంత్రులంతా ఇళ్ల‌కు బ‌య‌లుదేరారు. 

అయితే, న‌లుగురు మంత్రులు మాత్రం సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కేబిన్ ‌లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైనట్టు తెలుస్తోంది. ఈ భేటీలో బొత్స‌తో పాటు అవంతి శ్రీనివాస్‌, క‌న్న‌బాబు, తానేటి వ‌నిత పాల్గొన్నారు. ఈ భేటీలో వారు తాజా ప‌రిణామాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 

అంతేకాకుండా కొత్త కేబినెట్‌లో ప్ర‌స్తుతం రాజీనామా చేసిన వారిలో ఓ ఐదారుగురు ఉండే అవ‌కాశం ఉంద‌ని సీఎం చెప్ప‌డంతో వారు ఎవ‌ర‌న్న దానిపై కూడా ఈ భేటీలో మంత్రులు చ‌ర్చించినట్టు స‌మాచారం. ఓ అర‌గంట పాటు దీనిపై చ‌ర్చించిన త‌ర్వాత మిగిలిన మంత్రుల మాదిరిగానే ఈ న‌లుగురు మంత్రులు కూడా ఇంటి బాట ప‌ట్టారు.

More Telugu News