CM Jagan: ఇకపై మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళతారు: రాజీనామా చేసిన మంత్రులతో సీఎం జగన్

CM Jagan directs former ministers
  • రాజీనామా చేసిన ప్రస్తుత మంత్రివర్గం 
  • సీఎం జగన్ కు రాజీనామా లేఖల అందజేత
  • దిశానిర్దేశం చేసిన సీఎం
  • అందరినీ జిల్లాలకు పంపుతామని వెల్లడి

ఏపీలో మరికొన్ని రోజుల్లో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. ఇప్పటివరకు మంత్రులుగా పనిచేసినవాళ్లు ఇవాళ తమ రాజీనామాలను సీఎం జగన్ కు సమర్పించారు. మంత్రులతో చివరి క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం జగన్ రాజీనామా చేసిన వారికి దిశానిర్దేశం చేశారు. "మీ అందరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలివిడత అవకాశం ఇచ్చాం. ఇకపై మీరందరూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల్లోకి వెళతారు. మీకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం" అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News