ఏపీ మంత్రుల రాజీనామా.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌ల అంద‌జేత‌

  • ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
  • మంత్రులంతా రాజీనామాలు చేసిన వైనం
  • రాజీనామా లేఖలు జ‌గన్‌కు అంద‌జేసిన మంత్రులు
  • గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామాల‌ను పంప‌నున్న జ‌గ‌న్‌
ap ministers resigns to their minister posts

అంతా అనుకున్న‌ట్లుగానే ఏపీ కేబినెట్‌లోని 24 మంది మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీకి ఖాళీ లెట‌ర్ హెడ్‌ల‌తో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే త‌మ రాజీనామాలను చేశారు. ఈ లేఖ‌ల‌ను మంత్రులంతా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతిలో పెట్టారు. ఈ లేఖ‌ల‌ను జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌నున్న‌ట్టు స‌మాచారం. 

గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన అనంత‌రం మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై చ‌ర్చ జ‌ర‌గ్గా.. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మంత్రులంతా అక్క‌డిక‌క్క‌డే త‌మ రాజీనామాల‌ను స‌మ‌ర్పించారు. మంత్రుల రాజీనామాల స‌మ‌ర్ప‌ణ‌తో గురువారం నాటి కేబినెట్ భేటీ ముగిసింది.

More Telugu News