బ‌ర్త్ డే వేళ‌ త‌న‌ను రాముడితో పోల్చిన గేయ ర‌చ‌యిత‌కు ఆర్జీవీ ఆస‌క్తిక‌ర రిప్లై

  • వ‌ర్మ గురించి ప‌ద్యం రాసిన‌ సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ
  • రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే అని పేర్కొన్న వైనం
  • త‌న‌ను రావ‌ణుడితో పోల్చితేనే త‌నకు సంతృప్తిగా ఉంటుందన్న వ‌ర్మ‌
rgv gives reply to sira sri

సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నేడు పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ ఓ ట్వీట్ చేశారు. ''ఆర్జీవీ స‌ర్ జీ మీ గురించి మ‌రో ప‌ద్యం రాస్తున్నాను. సైకిల్ చైనుతో సినిమా... సైకీనే మార్చివేసి చరితాత్ముండై.. జైకొట్టినా ఛీకొట్టినా.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే'' అని సిరాశ్రీ పేర్కొన్నారు. దీనిపై రామ్ గోపాల్ వ‌ర్మ త‌నదైన శైలిలో స్పందించారు. ''బాగానే ఉంది.. కానీ, న‌న్ను రావ‌ణుడితో పోల్చితేనే నాకు మ‌రింత సంతృప్తిగా ఉంటుంది'' అని పేర్కొన్నారు. 

ఈ ట్వీట్ పై నెటిజ‌న్లు ఆర్జీవీ శైలిలోనే ఆస‌క్తిక‌ర‌ రిప్లైలు ఇస్తున్నారు. ''హ్యాపీ బ‌ర్త్ డే అని చెబుదాం అనుకున్నాను కానీ, నేను చెప్పినా చెప్పకపోయినా నీ లైఫ్ లో నువ్వు హ్యాపీ గా ఉంటావు. పుట్టుక మీద నీకు ఆశ లేదు కాబట్టి బర్త్ డే విషెస్ నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను'' అని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు.

More Telugu News