Andre Russell: ప్యాట్ కమిన్స్ బాదుడుకి ముగ్ధుడై మైదానంలో చిందులేసిన రస్సెల్.. స్పందించిన షారూక్

Andre Russell dances in front of Pat Cummins after his record IPL fifty Shah Rukh Khan gives best reaction
  • నాకు కూడా ఆండ్రే మాదిరి డ్యాన్స్ చేయాలని ఉందన్న షారుక్ 
  • జట్టు మొత్తం గొప్పగా ఆడిందని ప్రశంస 
  • ప్యాట్ సిక్సర్ల మోత మోగించాడని కితాబు 
వెస్టిండీస్ క్రికెటర్లు పట్టలేనంత సంతోషాన్ని డ్యాన్స్ రూపంలో ప్రదర్శించడం అభిమానులకు పరిచయమే. డ్వానే బ్రావో చిందులు ఐపీఎల్ అభిమానులకు గుర్తుంటాయి. ఇప్పుడు కేకేఆర్ సభ్యుడు ఆండ్రే రస్సెల్ కూడా ఇలాగే నాట్యమాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరిగింది. కోల్ కతా జట్టు సభ్యుడైన ప్యాట్ కమిన్స్ బ్యాట్ తో వీర విహారం చేసి 15 బంతుల్లోనే 56 పరుగులు కొట్టేసి విజయాన్ని అందించాడు. 

అంతకు ముందు పంజాబ్ తో మ్యాచ్ లో ఆండ్రే రస్సెల్ బ్యాట్ తో వీర విహారం చేసి 31 బంతుల్లో 70 పరుగులతో కోల్ కతాకు విజయాన్నిచ్చాడు. కానీ, ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో రస్సెల్ త్వరగా అవుట్ అయ్యాడు. తన ఆకాంక్షను కమిన్స్ నెరవేర్చడంతో ఆనందాన్ని ఆపులోకేక మ్యాచ్ అనంతరం మైదానంలో సహచర ఆటగాళ్ల చుట్టూ తిరుగుతూ నెమలిలా ఊగిపోయాడు.
 
దీనికి కోల్ కతా ఫ్రాంచైజీ యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ సైతం ఉత్సాహంగా స్పందించాడు. రస్సెల్ డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘‘ఆండ్రే మాదిరి నేను కూడా డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నా. మొత్తం జట్టు బాగా ఆడింది. ప్యాట్ దియే చక్కే(సిక్సర్లు కొట్టాడు)’’ అంటూ ట్వీట్ చేశాడు.
Andre Russell
dances
Pat Cummins
IPL
KKR
Shah Rukh Khan

More Telugu News