Telangana Governor: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ భేటీ

telangana governor meets union finance minister in delhi
  • ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌
  • కేంద్ర మంత్రి నిర్మ‌ల‌తో భేటీ
  • తెలంగాణ‌తో పాటు పుదుచ్చేరి అంశాలపై చ‌ర్చ‌
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె తెలంగాణ‌తో పాటు పుదుచ్చేరికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వితో పాటు పుదుచ్చేరి ఇంచార్జీ గ‌వ‌ర్న‌ర్‌గానూ త‌మిళిసై కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌తో పాటు పుదుచ్చేరి అంశాల‌పైనా కేంద్ర మంత్రితో చ‌ర్చించారు.

తెలంగాణ‌లో కేంద్రం నిధుల‌తో అమ‌లయ్యే ప‌థ‌కాల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించిన త‌మిళిసై.. పుదుచ్చేరి ఆర్థిక ప‌రిస్థితిపైనా చ‌ర్చ‌లు సాగించారు. అదే స‌మ‌యంలో పుదుచ్చేరికి కేంద్రం నుంచి మ‌రింత సాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు.
Telangana Governor
Tamilisai Soundararajan
Nirmala Sitharaman

More Telugu News