'రుతు ప్రేమ' కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీశ్ రావు

  • ప్రతి స్త్రీ జీవితంలో రుతు క్రమం చాలా ప్రధానమయినదన్న హరీశ్ రావు
  • అందరికీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామన్న మంత్రి
  • నార్మల్ డెలివరీలు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందన్న హరీశ్
Harish Rao launches Ruthu Prema

సిద్ధిపేట 5వ వార్డులో 'రుతు ప్రేమ' అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి స్త్రీ జీవితంలో రుతుక్రమం చాలా ప్రధానమయినదని చెప్పారు. మహిళల సహకారం వల్ల మనం ఈరోజు తొలి మెట్టు ఎక్కామని అన్నారు. 

రుతుక్రమం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ప్రతి నెలా జరిగే ప్రక్రియ అని... మహిళలు ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలని హరీశ్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని... స్త్రీలందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అందరికీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. శానిటరీ ప్యాడ్స్ వాడకంలో ప్రపంచానికి మనం ఆదర్శం కావాలని అన్నారు.

ఇక తెలంగాణలో డెలివరీల కోసం చేస్తున్న సర్జరీలు 62 శాతం ఉన్నాయని... నార్మల్ డెలివరీలు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదటి గంటలో ముర్రుపాలు తాగే పిల్లలు మన రాష్ట్రంలో 37 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

More Telugu News