TDP: మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు

budda venkanna comments on minister vellampalli
  • వెల్లంపల్లి రూ.1,535 కోట్ల మేర అవినీతికి పాల్ప‌డ్డారన్న బుద్ధా
  • ఈ మొత్తాన్ని ఇప్పుడు రికవ‌రీ చేయాల్సిందేనని వ్యాఖ్య 
  • దొంగ‌ల‌కే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులిచ్చార‌న్న వెంకన్న 
ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న బుధ‌వారం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మంత్రివ‌ర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్న నేప‌థ్యంలో వెల్లంపల్లి అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును రిక‌వ‌రీ చేయాల‌ని బుద్ధా వెంక‌న్న డిమాండ్ చేశారు.

మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా వెల్లంపల్లి రూ.1,525 కోట్ల మేర అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించిన బుద్ధా.. మంత్రిగా ఆయ‌న‌ను సాగ‌నంపే ముందు ఈ సొమ్మును రిక‌వ‌రీ చేయాల‌ని డిమాండ్ చేశారు. వెల్లంపల్లి అవినీతికి సంబంధించి త‌మ వ‌ద్ద పూర్తి ఆధారాలున్నాయ‌ని బుద్ధా తెలిపారు. సీఎం జ‌గ‌న్ దొంగ‌ల‌కే మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని, అభివృద్ధిలో జీరోగా ఉన్న వెల్లంపల్లి అవినీతిలో మాత్రం నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును సాధించార‌ని వెంకన్న ఎద్దేవా చేశారు.
TDP
Budda Venkanna
Vellampalli Srinivasa Rao

More Telugu News