AP Cabinet: మంత్రివ‌ర్గ పునర్వ్యవస్థీకరణపై ఆనం వ్యాఖ్య‌లు

anam ramanarayana reddy comments on cabinet reshuffle
  • మంత్రి ప‌ద‌వుల రేసులో తాను లేన‌న్న ఆనం
  • సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాజ‌కీయాల‌ను వాడుకోనని వెల్ల‌డి
  • తాను కొత్త‌గా ఏమీ వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేదని ప్ర‌క‌ట‌న‌
ఏపీ మంత్రివ‌ర్గ పునర్వ్యవస్థీకరణపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కాసేప‌టి క్రితం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వుల రేసులో తాను లేన‌ని ఆయ‌న ప్రకటించారు. సొంత ప్ర‌యోజ‌నాల కోసం తాను రాజ‌కీయాల‌ను వాడుకోన‌ని చెప్పిన రామ‌నారాయ‌ణ రెడ్డి.. తాను కొత్త‌గా ఏమీ వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా వ్యాఖ్యానించారు. 

మంత్రివ‌ర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని వివ‌రాలు వెల్ల‌డించిన ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ఆమోదం త‌ర్వాతే అంద‌రికీ స‌మాచారం వ‌స్తుంద‌ని తెలిపారు. జాబితాలో ఉన్న వారికి ఫోన్ ద్వారా స‌మాచారం ఇస్తార‌ని చెప్పిన ఆనం.. తాను మాత్రం మంత్రి ప‌ద‌వుల రేసులో లేన‌ని వెల్ల‌డించారు.
AP Cabinet
YSRCP
Anam Ramanarayana Reddy

More Telugu News