Jagga Reddy: రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ

  • ఢిల్లీలో జ‌రిగిన భేటీ
  • పార్టీ ప‌రిస్థితుల‌పై వివ‌రించిన జ‌గ్గారెడ్డి
  • రేవంత్‌తో జ‌గ్గారెడ్డి విభేదాల నేప‌థ్యంలో భేటీకి ప్రాధాన్యం
gagga reddy meets rahul gandhi

కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీనియ‌ర్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) బుధ‌వారం ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇప్ప‌టికే టీపీసీసీ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చిస్తున్న రాహుల్ గాంధీ.. బుధ‌వారం త‌న‌ను క‌లిసేందుకు జ‌గ్గారెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీతో భేటీ అయిన జ‌గ్గారెడ్డి.. పార్టీలో చోటుచేసుకున్న ప‌లు ప‌రిణామాల‌ను రాహుల్‌కు వివ‌రించారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త‌న‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న త‌న‌కు కీల‌క నేత‌ల కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌ని జ‌గ్గారెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే జగ్గారెడ్డి నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పలు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో భ‌గ్గుమ‌న్న జ‌గ్గారెడ్డి.. తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

More Telugu News