Telangana: గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్, స్టైపెండ్

Telangana Govt To Provide Free Coaching and Stipend For Groups Aspirants
  • ఇవాళ్టి నుంచి ఫ్రీ కోచింగ్ కు రిజిస్ట్రేషన్
  • ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
  • గ్రూప్ 1 అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైపెండ్ 
  • గ్రూప్ 2 అభ్యర్థులకు రూ.2 వేలు
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఈ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. మొత్తం 1.25 లక్షల మందికి ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇవాళ ఆయన ఉచిత శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. 

గ్రూప్ 1 ఉద్యోగార్థులకు ఆరు నెలల పాటు నెలకు రూ.5 వేలు, గ్రూప్ 2 అభ్యర్థులకు నెలకు రూ.2 వేలు, ఎస్సై కోచింగ్ తీసుకునే వారికి రూ.2 వేల స్టైపెండ్ ఇస్తామని ప్రకటించారు. ఫ్రీ కోచింగ్ ను 1.25 లక్షల మందికి ఇచ్చినా.. స్టైపెండ్ ను మాత్రం కేవలం 10 వేల మందికే ఇవ్వనున్నారు. 

రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం గల వారు ఇవాళ్టి నుంచి ఫ్రీ కోచింగ్ కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గంగుల సూచించారు. 16 వరకు అవకాశం ఉంటుందని, అదే రోజు ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. 21 నుంచి క్లాసులను మొదలుపెడతామని తెలిపారు.
Telangana
Jobs
Group 1
Group 2
TSPSC
Gangula Kamalakar

More Telugu News