exercises: మంచి ఫలితాలనిచ్చే మూడు వ్యాయామాలు

  • రోజూ 5 కిలోమీటర్ల పాటు పరుగు
  • పుల్ అప్స్, పుష్ అప్స్
  • ప్లాంక్స్, క్రంచెస్ తో మంచి ఫలితాలు
Young or old 3 exercises everyone should do

శారీరకంగా శ్రమించడం ఒక్కటే ఫిట్ గా ఉండడానికి మార్గం. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు, ఎముకలు, కండరాల బలానికి వ్యాయామాలు తోడ్పడతాయి. అంతేకాదు, మానసిక ఆరోగ్యానికి సైతం శారీరక వ్యాయామాలు ఉపయోగపడతాయి. కనుక నిత్యం చేసుకోతగిన కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. వీటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పుల్ అప్స్, పుష్ అప్స్
ఇవి అందరికీ సులభంగా అనిపించకపోవచ్చు. ఆరంభంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ, అలవాటు అయితే సౌకర్యంగానే చేసుకోవచ్చు. కండరాలు, ఎముకల బలానికి వీటితో ప్రయోజనం ఉంటుంది. 

క్రంచెస్, ప్లాంక్స్
భంగిమ చక్కగా ఉండాలని కోరుకునే వారు ప్లాంక్స్, క్రంచెస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వీటికి సంబంధించిన వీడియోలు వస్తాయి. కనీసం రెండు నిమిషాల చొప్పున వీటిని చేసినా ఫలితం ఉంటుంది. 

ఐదు కిలోమీటర్ల పరుగు
ఎక్కువ మంది చేయడానికి సాధ్యపడే వ్యాయామంగా దీన్ని చెప్పుకోవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యానికి పరుగు మేలు చేస్తుంది. అంతేకాదు ఊపిరితిత్తులు కూడా బలోపేతం అవుతాయి. కనుక నిత్యం మూడు మైళ్లు (5 కిలోమీటర్లు) పరుగు తీయడాన్ని అలవాటు చేసుకోవాలి. 

More Telugu News