RCB: రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి.. సాంగ్ తో సెలబ్రేట్ చేసుకున్న ఆర్సీబీ టీమ్

RCB celebrate win over RR with new team song in dressing room
  • వాంఖడే స్టేడియంలో మ్యాచ్ తర్వాత డిన్నర్
  • దీనికి ముందు ఆర్సీబీ జట్టు సంబరాలు
  • కొత్త పాట ఆలపిస్తూ ఉత్సాహంతో ఊగిపోయిన సభ్యులు
రాజస్థాన్ జట్టుపై అపూర్వ విజయం అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త సాంగ్ తో సంబరాలు చేసుకుంది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, షాబాద్ అహ్మద్ దంచి కొట్టుడు వల్లే ఆర్సీబీకి విజయం దక్కింది. కీలక వికెట్లు కోల్పోయినా 170 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం వీరి డ్యాషింగ్ బ్యాటింగ్ వల్లే సాధ్యమైంది. 

వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత డిన్నర్ కు ముందు ఆర్సీబీ టీమ్ విజయ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులు అందరూ గీతాన్ని ఆలపించారు. సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. 

‘‘ద ప్యాంట్స్ ఆర్ రెడ్. ద షర్ట్ ఈజ్ బ్లూ. ద గోల్డెన్ లయన్ ఈజ్ షైనింగ్. వీ ఆర్ ఆర్సీబీ. వీ ఆర్ ప్లేయింగ్ బోల్డ్. గో టూ ద ఫైనల్ ఆన్ అవర్ ఓన్. దోజ్ అదర్ టీమ్స్ డోంట్ బాథర్ మీ, ఫ్రమ్ ఆర్సీబీ ఐయామ్ ప్రౌడ్ టు బీ. వీ ఆర్ ఆర్సీబీ ఆర్సీబీ..’’ అంటూ ఆలపించారు. 
RCB
celebrations
winning
RR
IPL
new song

More Telugu News