YSRCP: కేంద్ర మంత్రులు నిర్మ‌ల‌, షెకావ‌త్‌ల‌తో జ‌గ‌న్ భేటీ

ys jagan met union ministers nirmala sitharaman and gajendra singh shekhawat
  • మోదీతో భేటీ త‌ర్వాత నిర్మ‌లతో జ‌గ‌న్ భేటీ
  • నిర్మ‌ల‌తో భేటీ ముగిశాక షెకావ‌త్‌తో జ‌గ‌న్ భేటీ
  • ఆ త‌ర్వాత అమిత్ షాతో భేటీ కానున్న జ‌గ‌న్‌
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస‌బెట్టి కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్నారు. నేటి సాయంత్రం ఢిల్లీ చేరుకున్న‌ వెంట‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోదీతో భేటీ అయిన జ‌గ‌న్‌.. ఆయనతో దాదాపు గంట‌కు పైగానే చ‌ర్చ‌లు సాగించారు. ఈ భేటీ ముగిసిన వెంట‌నే ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో భేటీల‌కు బ‌య‌లుదేరారు. 

మోదీతో భేటీ ముగిశాక‌.. అటు నుంచి అటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇంటికి చేరుకున్న జ‌గ‌న్ ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి ఆమెకు వివ‌రించిన జ‌గ‌న్‌.. రుణ ప‌రిమితిని స‌వ‌రించాలని విజ్ఞ‌ప్తి చేశారు. 

నిర్మ‌ల‌తో భేటీ ముగిసిన తర్వాత జ‌గ‌న్.. కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ఇంటికి చేరుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి స‌వ‌రించిన అంచ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని షెకావ‌త్‌ను అభ్య‌ర్థించారు. షెకావ‌త్‌తో భేటీ ముగియ‌గానే.. నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ కానున్నారు.
YSRCP
YS Jagan
Nirmala Sitharaman
Gajendra Singh Shekhawat

More Telugu News