Imran Khan: పాకిస్థాన్ ను విడిచి పారిపోతున్న ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సన్నిహితులు!

Pakistan media reports Imran Khan family friends leaves country
  • ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం
  • కొట్టివేసిన డిప్యూటీ స్పీకర్
  • అసెంబీ రద్దుకు ఇమ్రాన్ సిఫారసు
  • ఆమోదం తెలిపిన దేశాధ్యక్షుడు
  • పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్
పాకిస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఏ మలుపు తీసుకుంటుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పుకోవడంతో ఎప్పుడు ఏం జరగనుందోనని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ తాజా భార్య బుష్రా బీబీ సన్నిహితురాలు ఫరా ఖాన్ పాకిస్థాన్ ను విడిచి వెళ్లిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. 

ఇమ్రాన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఫరా ఖాన్ అధికార వర్గాల్లో చక్రం తిప్పారని, అధికారుల పనులు చేసిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని మీడియా ఆరోపించింది. ఫరా ఖాన్ 32 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని పాక్ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. నాడు ఇమ్రాన్ అండతో చెలరేగిన ఫరా ఖాన్ వంటి సన్నిహితులు ఇప్పుడు ఇమ్రాన్ అధికారంలోకి లేకపోయేసరికి అరెస్టులకు భయపడి దేశాన్ని విడిచి పారిపోతున్నారని మీడియా పేర్కొంది.
Imran Khan
Farah Khan
Bushra Bibi
Pakistan

More Telugu News